Home న్యూస్ తమ్ముడు డే-3 కలెక్షన్స్…..దెబ్బ మీద దెబ్బ ఇది!!

తమ్ముడు డే-3 కలెక్షన్స్…..దెబ్బ మీద దెబ్బ ఇది!!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ బడ్జెట్ తో రూపొందిన యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు(Thammudu Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఆ బడ్జెట్ కి గాని, బిజినెస్ కి గాని ఏమాత్రం న్యాయం చేసే విధంగా కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోవడం లేదు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత మూడో రోజున సండే అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా ఆల్ మోస్ట్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే..

రెండు వారాల క్రితం వచ్చిన కుబేర సినిమా కన్నా కూడా తక్కువ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటున్న తమ్ముడు మూవీ ఉన్నంతలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజున ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోతూ ఉండగా…

ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 75 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా వీకెండ్ లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here