మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని ఊచకోత కోసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మాస్ రచ్చ చేస్తూ టార్గెట్ లో సగానికి పైగా రికవరీని సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో రచ్చ చేస్తుంది..
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మూడో రోజు బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…
రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సేఫ్ సైడ్ లో అవలీలగా మరోసారి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా టోటల్ గా మూడో రోజు షేర్ లెక్క..
6.5-7 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది, ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ అండ్ నైట్ షోల డ్రాప్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు వెలతాయో చెప్పగలం, ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా…
ఓవర్సీస్ లో మాత్రం కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడే మేజర్ కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మూడో రోజు ఎండ్ అయ్యే టైంకి సినిమా ఈ కలెక్షన్స్ మార్క్ ని మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.