మొదటి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
3వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపించిన సినిమా ఈవినింగ్ షోలకు మంచి గ్రోత్ ని కూడా చూపెడుతూ ఉండగా…
నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ కనుక కొనసాగిస్తే మూడో రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా మరోసారి ఈజీగా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ షేర్ లెక్క 7.5-8 కోట్ల రేంజ్ దాకా కూడా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. ఆ మార్క్ ని కూడా మించితే అది ఊహకందని భీభత్సం అనే చెప్పాలి ఇప్పుడు…. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా…
మరియు ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 9.5-10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. నాగ చైతన్య కెరీర్ లో ఇది సెన్సేషనల్ రికార్డ్ డే 3 కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా వీకెండ్ అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.