బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఉగ్రం మూవీ రామ బాణం సినిమా కన్నా కూడా కొంచం బెటర్ టాక్ ని సొంతం చేసుకోగా రెండో రోజు మొదటి రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రామ బాణం సినిమా టాక్ ఇంపాక్ట్ గట్టిగానే పడగా ఏమాత్రం హోల్డ్ ని గ్రోత్ ని అయితే చూపించడం లేదు అని చెప్పాలి ఇప్పుడు.
మొత్తం మీద ఉగ్రం మూవీ మూడో రోజులో ఎంటర్ అవ్వగా మొత్తం మీద మరోసారి రెండో రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల 10% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నాయి. ఇక రామ బాణం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో..
మరోసారి 20% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఉగ్రం మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు అటూ ఇటూగా ఇదే రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక ఉగ్రం మూవీ వరల్డ్ వైడ్ గా 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా రామ బాణం సినిమా మూడో రోజు 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…. ఈ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇక రేసులో పూర్తిగా వెనకబడిపోయింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక 2 సినిమాల వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.