మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 104 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie 3rd day Collections) సినిమా ఇప్పుడు మూడో రోజు దసరా పండగ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా రచ్చ చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు మీద గ్రోత్ ని చూపించగా మరీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదు. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా తమిళ్ లో రెండో రోజు మీద మంచి గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా అవలీలగా మరోసారి సినిమా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక, కేరళలో మంచి జోరుని చూపెడుతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి 1.2 మిలియన్ రేంజ్ లో…
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మూడో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు….40 కోట్ల రేంజ్ నుండి 42 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు అంచనాలను మించిపొతే ఓవరాల్ కలెక్షన్స్ 45 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…