మొదటి రోజు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన బాలయ్య రెండో రోజు వాల్తేరు వీరయ్య సినిమా వలన కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు వీర సింహా రెడ్డి రెండో రోజు కన్నా కూడా మూడో రోజు మంచి గ్రోత్ తో దూసుకు పోతూ రచ్చ చేస్తుంది సినిమా…
రాయలసీమలో సినిమా ది బెస్ట్ అనిపించేలా ఈ రోజు హోల్డ్ ని చూపించింది, నైజాంలో కూడా మంచి జోరునే చూపించిన సినిమా ఓవరాల్ గా రెండో రోజు మీద 30% రేంజ్ లో గ్రోత్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా…
మాస్ సెంటర్స్ లో ఊరమాస్ అనిపించే విధంగా ఉన్నాయి. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అటూ ఇటూగా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగున్నాయి కాబట్టి 7.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… ఓవరాల్ గా రెండో రోజు మీద ఇది ఊరమాస్ గ్రోత్ అనే చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది… ఇక టోటల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…