Home న్యూస్ 3వ రోజు 3వ ప్లేస్….5లో నాలుగు ఒక్కడి పేరు మీదే!!

3వ రోజు 3వ ప్లేస్….5లో నాలుగు ఒక్కడి పేరు మీదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతున్న ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD Movie) మూడో రోజు అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే అనుకున్న కలెక్షన్స్ కి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపి ఉండేది… కానీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వలన నైట్ షోలకు ఇబ్బంది తలెత్తగా అయినా కూడా తట్టుకున్న సినిమా మూడో రోజు ఓవరాల్ గా ఇప్పుడు…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో రోజు కన్నా తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ 17 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 19.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా మరోసారి రెండో రోజు మాదిరిగానే మూడో ప్లేస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…

మొదటి ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా రెండో ప్లేస్ లో ప్రభాస్ నటించిన సలార్ ఉండగా ఇప్పుడు మూడో ప్లేస్ లో కల్కి మూవీ చోటుని సొంతం చేసుకుంది. ఒకసారి ఓవరాల్ గా మూడో రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే….

3rd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 33.53CR
👉#Salaar- 22.40CR
👉#Kalki2898AD – 19.83CR*****
👉#AdiPurush – 17.07CR
👉#Baahubali2- 16.60Cr
👉#Pushpa- 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr
👉#WaltairVeerayya – 12.61CR
👉#SarkaruVaariPaata- 12.01CR
👉#AlaVaikunthapurramuloo- 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#RadheShyam- 10.58Cr
👉#BROTheAvatar- 10.48Cr

మొత్తం మీద లిస్టులో ప్రభాస్ రీసెంట్ మూవీస్ అన్నీ ఉండగా టాప్ 5 లోనే చూసుకుంటే ప్రభాస్ నటించిన సినిమాలు ఏకంగా 4 ఉండటం ఏ రేంజ్ లో ప్రభాస్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేస్తున్నాడు అన్నదానికి నిదర్శనం. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఇదే జోరుని కొనసాగిస్తే మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here