బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూవీ మొదటి వారంలో దుమ్ము లేపి ఇప్పుడు రెండో వారంలో కొత్త సినిమా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ పోటిలో…
స్లో అవుతుంది అనుకున్నా కూడా ఆ సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ తో 9వ రోజు నుండి తిరిగి గ్రోత్ ని చూపించడం స్టార్ట్ చేయగా ది ఫ్యామిలీ స్టార్ రెండో రోజు కలెక్షన్స్ ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. ఇక మూడో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా మరోసారి ఆన్ లైన్ టికెట్ సేల్స్…
రెండో రోజు కన్నా కూడా తక్కువగానే ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఈ రోజు గ్రోత్ కనిపిస్తూ ఉండటంతో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 2 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ 3వ రోజు వరల్డ్ వైడ్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అందుకునే అవకాశం ఉంది. ఇక రెండు సినిమాల అఫీషియల్ ఈ రోజు కలెక్షన్స్ ఎంతవరకు అంచనాలను మించుతాయో చూడాలి…