యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా కానీ ఆ అంచనాలను అందుకోలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో మొదటి రోజు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల ఓపెనింగ్స్ రికార్డులు అన్నీ బ్రేక్ చేసిన ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం మౌత్ టాక్ ఇంపాక్ట్ వలన భారీగా స్లో డౌన్ అవ్వక తప్ప లేదు…
ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ డే 2 తో పోల్చితే 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు హోల్డ్ చూపించినా కానీ…
అది సినిమా అందుకోవాల్సిన బిజినెస్ కు అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో మాత్రం సినిమా ఉన్నంతలో బెటర్ గానే హోల్డ్ చేసింది అని చెప్పాలి టాక్ దృశ్యా… ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
మూడో రోజు అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా 3.3 కోట్ల రేంజ్ నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు గ్రోత్ ని చూపిస్తే సినిమా ఇంకొంచం ఎక్కువ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకోవచ్చు కానీ అందుకోవాల్సిన కొండంత టార్గెట్ దృశ్యా మాత్రం ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. ఏదైనా అద్బుతం జరిగినా కానీ టార్గెట్ ను అందుకునే అవకాశమే లేదు… ఇక ఓవరాల్ గా సినిమా 3 రోజులకు గాను సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.