ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలను అన్నింటినీ ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) సినిమా రెండో రోజు మూడో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా మూడో రోజు అనుకున్న అంచనాలను మించి పోయి మరీ…
సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….ఆల్ మోస్ట్ టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాల రేంజ్ కి ఏమాత్రం తీసిపోని లెవల్ లో వసూళ్ళని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మూడో రోజు ఎక్స్ పెర్టేషన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో మించి పోయిన సినిమా ఏకంగా..
5.88 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది… దాంతో టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ఏకంగా టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం.
ఒకసారి టాలీవుడ్ లో మూడో రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Day 3 AP-TG Top collections for Medium Range Movies
👉#Thandel- 8.40Cr
👉#Uppena – 8.26Cr
👉#TilluSquare – 7.44Cr
👉#DASARA – 6.73Cr
👉#MadSquare – 5.88CR******
👉#Virupaksha – 5.77CR
👉#HanuMan- 5.70CR
👉#Kushi- 5.68Cr
👉#LoveStory- 5.19Cr
👉#Bimbisara- 5.02CR
👉#SaripodhaaSanivaaram – 4.68CR
మొత్తం మీద ఈ ఏడాది వచ్చిన తండేల్ మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో డే 3 రికార్డ్ ను నమోదు చేసింది. మిగిలిన సినిమాల్లో బడ్జెట్ పరంగా తక్కువ బడ్జెట్ తో ఉప్పెన మరియు మ్యాడ్2 సినిమాలు టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి.