Home న్యూస్ వర్షం4K 3rd రీ రిలీజ్….బుకింగ్స్ మాత్రం కుమ్మేశాయిగా!!

వర్షం4K 3rd రీ రిలీజ్….బుకింగ్స్ మాత్రం కుమ్మేశాయిగా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సినిమాల్లో రీ రిలీజ్ లో సలార్ రీసెంట్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తన కెరీర్ లో సొంతం చేసుకుని రీ రిలీజ్ లలో తన కెరీర్ బెస్ట్ ని ను నమోదు చేసింది. ఇక ఇప్పుడు మరో రీ రిలీజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అయ్యాడు రెబల్ స్టార్…

ఇది వరకు రెండు సార్లు రీ రిలీజ్ అయినా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయిన ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ వర్షం4K(Varsham4K Re Release) సినిమాను ఇప్పుడు సమ్మర్ కానుకగా రీ రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా మొదటి 2 సార్లు రీ రిలీజ్ అయినప్పుడు కన్నా…

మూడో సారి రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ రోజుకి ముందు వరకు ఓవరాల్ గా 33 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా…

సినిమా మేకర్స్ ఆల్ రెడీ కోటి రేంజ్ లో గ్రాస్ ప్రీ సేల్స్ ను సినిమా ఆల్ రెడీ సొంతం చేసుకుందని చెబుతున్నారు కానీ ఓవరాల్ గా 75-80 లక్షల రేంజ్ లో గ్రాస్ సేల్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మంచి జోరుని చూపెడుతూ ఉండగా…

మొదటి 2 సార్లతో పోల్చితే మూడో సారి చాలా బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించబోతుంది ఇప్పుడు. ఈ వీక్ లో ఎలాగూ మరీ థియేటర్స్ కి భారీ లెవల్ లో రప్పించే సినిమాలు లేక పోవడంతో వర్షం సినిమా ఈ వీకెండ్ లో డీసెంట్ లెవల్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here