టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాలా ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు….ఎప్పటి నుండో రూపొందుతూ వస్తున్న హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు ఇప్పుడు జూన్ 12న రిలీజ్ కాబోతూ ఉండగా…
సినిమా ప్రమోషన్స్ పనులను ముమ్మరం చేయడం మొదలు పెట్టారు మేకర్స్…ఈ క్రమంలో సినిమా నుండి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు… అసుర హనమ్(Asura Hananam Lyrical) లిరిక్ తో తెరకెక్కిన ఎలివేషన్ సాంగ్ ను రిలీజ్ చేయగా…
ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సాంగ్ ని మరో లెవల్ కి వెళ్ళేలా చేసింది అని చెప్పాలి. ఇక సాంగ్ లో చూపించిన విజువల్స్ కానీ పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్ కానీ ఎలివేషన్ లు కానీ ఫైట్ సీన్స్ షాట్స్ కానీ అన్నీ కూడా సాంగ్ లో హైలెట్ గా నిలిచాయి..
సినిమా చాలా డిలే అవుతూ ఉండటంతో క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ కూడా సాంగ్ లో చూపించిన క్వాలిటీ మాత్రం మరో లెవల్ లో ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. ఈ సినిమా లిరికల్ గానే ఫస్ట్ విన్నప్పుడే ఎక్కేయడంతో..
థియేటర్స్ లో చూసే టైంలో గూస్ బంప్స్ ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను ఈ సాంగ్ మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జూన్ 12 న ఏ రేంజ్ లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇక..