ఒక సినిమా మీద ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అన్నది ఆ సినిమా ప్రమోషనల్ ఫుటేజ్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుంది అన్న దానిపై ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. మొదటి రోజు సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ వచ్చినా లాంగ్ రన్ లో స్టడీగా వ్యూస్ అండ్ లైక్స్ పెరగకపోతే ఆడియన్స్ లో అనుకున్న రేంజ్ లో రీచ్ రాలేదని అనుకోవచ్చు.
లేటెస్ట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా నుండి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు,అసుర హనమ్(Asura Hananam Lyrical) లిరికల్ వీడియోగా వచ్చిన ఈ సాంగ్ కి…
మొదటి రోజున ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ సొంతం అయ్యింది. ఆల్ మోస్ట్ 19.93 మిలియన్ వ్యూస్ ని మొదటి 24 గంటల్లో అందుకోగా సాంగ్ లిరికల్ వీడియోల పరంగా టాప్ 4 ప్లేస్ ను అందుకుంది. కానీ తర్వాత రోజు నుండి సాంగ్ కి అసలు వ్యూస్ రావడమే లేదు ఇప్పుడు..
సాంగ్ వచ్చి 5 రోజులు కంప్లీట్ అవ్వగా మొదటి రోజు తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కేవలం 1.25 మిలియన్స్ రేంజ్ లోనే వ్యూస్ సాంగ్ కి సొంతం అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో ఫస్ట్ డే యాడ్స్ వేసి వ్యూస్ ని తెచ్చుకున్నారు కానీ రెండో రోజు నుండి…
సాంగ్ కి మినిమమ్ వ్యూస్ కూడా రావడం లేదు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సాంగ్ ను ట్రోల్ చేస్తున్నారు. సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు తర్వాత అనుకున్న రేంజ్ లో అయితే…
వ్యూస్ రాలేదనే చెప్పాలి. సినిమా మరీ లేట్ అవుతూ రావడం ఆడియన్స్ లో క్రేజ్ తగ్గడం లాంటివి మేజర్ కారణాలు అయినా కూడా పవర్ స్టార్ సినిమా కి ఇంకా ఎక్కువగానే అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారు… ప్రస్తుతానికి ఆ రేంజ్ కి వెళ్ళలేక పోతున్న హరి హర వీరమల్లు ఇక ట్రైలర్ తో గట్టిగా దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.