టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar) సినిమా ఆడియన్స్ ముందుకు ఆగస్ట్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ఆల్ రెడీ..
టీసర్ ఆకట్టుకోగా 2 సాంగ్స్ రిలీజ్ అవ్వగా మొదటి పాటకు మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా రెండో సాంగ్ కి రెస్పాన్స్ చాలా తక్కువగా సొంతం అయ్యింది. ఇక రీసెంట్ గా సినిమా నుండి మూడో సాంగ్ అయిన మిల్కీ బ్యూటీ (Milky Beauty Lyrical Song |Bholaa Shankar) రిలీజ్ అవ్వగా…
సాంగ్ లో మెగాస్టార్ లుక్స్ కానీ, ఫుల్ గ్రేస్ తో వేసిన స్టెప్స్ కానీ అద్బుతంగా మెప్పించినా కానీ ఓవరాల్ గా సాంగ్ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగాం యూట్యూబ్ లో మొదటి 24 గంటల రెస్పాన్స్ చాలా తక్కువగానే సొంతం అయింది ఇప్పుడు.
మొత్తం మీద 24 గంటల్లో యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 2.91 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ మాత్రం చాలా తక్కువ 42 వేల లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాంగ్ కి ఇలాంటి రెస్పాన్స్ కి…
యూట్యూబ్ లో వీడియోకి థంబ్ నైల్ లాంటివి కరెక్ట్ గా సెట్ కాక పోవడం, వీడియో కూడా ట్రెండ్ అవ్వకపోవడం లాంటివి కారణాలు అయినా ఓవరాల్ గా వ్యూస్ అండ్ లైక్స్ మాత్రం తక్కువగానే వచ్చాయి. సినిమా బజ్ ను పెంచాలి అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రచ్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.