నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మూడో వారాలను పూర్తి చేసుకోగా… సినిమా మూడో వారం ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది…
ముందు స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వారంలో మేజర్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత రెండో వారం లో స్లో అవ్వగా మూడో వారంలో కొత్త సినిమాల రిలీజ్ లు ఉన్నా కూడా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది.
మొత్తం మీద మొదటి వారంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా రెండో వారంలో మొత్తం మీద 10.65 కోట్ల దాకా షేర్ ని సాధించింది. మూడో వారం చాలా వరకు సినిమాలకు షేర్స్ రావడం తక్కువ అవుతుంది. అయినా కానీ భగవంత్ కేసరి 2.78 కోట్ల దాకా షేర్ ని అందుకుంది.
ఒకసారి సినిమా వారాల వారిగా సాధించిన షేర్ అండ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే…
#BhagavanthKesari Week Wise Collections
👉1st week – 55.09CR (98.85CR~ Gross)
👉2nd Week – 10.65CR (20.15CR~ Gross)
👉3rd Week – 2.78CR (5.70CR~ Gross)
Total Collections – 68.52CR(124.70CR~ Gross)
ఇలా మూడు వారాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వగా దీపావళి హాలిడేస్ కూడా సినిమాకి ఉండటంతో ఇంకా కొద్ది వరకు కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మరి టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో సినిమా పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి.