6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నా కూడా దేవర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ…
దుమ్ము లేపింది. రెండో వీక్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన తర్వాత మూడో వీక్ లో దసరా పండగ వీకెండ్ లో రిమార్కబుల్ జోరుని చూపించిన దేవర మూవీ టాలీవుడ్ లో ఓవరాల్ గా మూడో వీక్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది…
ఓవరాల్ గా సినిమా 21 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా మూడో వారంలో దసరా వీకెండ్ అడ్వాంటేజ్ తో దుమ్ము లేపి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ హోల్డ్ ని చూపించిన ఓవరాల్ గా మూడో వారంలో 12.92 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడో వారంలో ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొత్తం మీద మొదటి ప్లేస్ లో బాహుబలి2 మూవీ నిలవగా రెండో ప్లేస్ లో హనుమాన్ మూవీ నిలిచింది…ఒకసారి ఓవరాల్ గా మూడో వీక్ లో…
ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
Top 3rd Week Shares in AP TG
👉#Baahubali2 – 18.20CR~
👉#HanuMan – 16.01Cr
👉#Devara – 12.92CR******
👉#RRR – 12.31CR
👉#Kalki2898AD – 10.58Cr
👉#Baahubali – 10.50Cr~
👉#WaltairVeerayya – 9.63CR
👉#AlaVaikunthaPurramuloo- 9.59Cr
👉#AttarintikiDaredi – 8.55Cr~
👉#Rangasthalam 8.45Cr~
👉#F2- 8.25CR~
ఓవరాల్ గా ఈ లిస్టులో ఒక్క దేవర మూవీ మాత్రమే మిక్సుడ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో సైతం సాలిడ్ గా జోరు చూపించింది. ఇక మిగిలిన రన్ లో దేవర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.