టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఎప్పటి కప్పుడు తన సినిమాతో దుమ్ము దుమారం లేపుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ మూవీస్ అన్నీ రీ రిలీజ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా….క్లాస్ మూవీస్ పెద్దగా ఆడవు అనుకున్నా…
కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన మురారి కానీ ఈ ఇయర్ అన్ సీజన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అయితే…
వీకెండ్ లో మంచి జోరు ని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 4వ రోజున వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించగా…ఓవరాల్ గా రీ రిలీజ్ లో సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది సినిమా…
ఓవరాల్ గా మహేష్ బాబు నటించిన సినిమాల పరంగా 3 సినిమాలు ఓవరాల్ గా 5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ లో ఎక్కువ సార్లు 5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించాడు మహేష్ బాబు…ఇది వరకు బిజినెస్ మాన్ మూవీ ఈ మార్క్ ని అందుకోగా..
లాస్ట్ ఇయర్ మురారి మూవీ టోటల్ రన్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేయగా…ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో మూడో సారి ఈ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయడం విశేషం కాగా లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.