Home న్యూస్ నైజాం గడ్డ మీద ప్రభాస్ రికార్డ్….60 కోట్ల సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్!!

నైజాం గడ్డ మీద ప్రభాస్ రికార్డ్….60 కోట్ల సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు మొదటి వారాన్ని హిస్టారికల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…

అన్ని ఏరియాల కలెక్షన్స్ ఒకెత్తు అయితే నైజాం ఏరియాలో సినిమా హోల్డ్ చేస్తున్న తీరు మరో ఎత్తు అని చెప్పాలి ఇప్పుడు..కాగా సినిమా తెలుగు రాష్ట్రాలలో సైతం నైజాం ఏరియాలో హోల్డ్ మరో లెవల్ లో ఉండగా…. సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో….

హిస్టారికల్ 60 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…మిగిలిన హీరోలు ఒక్కో సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటూ ఉండగా ప్రభాస్ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండగా వాటితో రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాడు…

ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా మూడు సార్లు ఒక్క నైజాం ఏరియాలోనే 60 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాలతో సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేశాడు…. ప్రభాస్ నటించిన బాహుబలి2, ఫస్ట్ 60 కోట్ల షేర్ మూవీగా నిలిచింది…

ఇక 7 నెలల క్రితం ప్రభాస్ నటించిన సలార్(Salaar Movie) 60 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యి ఆ మార్క్ ని క్రాస్ చేసి ఏకంగా 70 కోట్ల మార్క్ క్లబ్ లో చేరి ప్రభాస్ కెరీర్ లో రికార్డ్ ను సృష్టించింది. ఇక ఇప్పుడు కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లోనే 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి…

ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ ని నైజాంలో అందుకున్న సలార్ ని త్వరలోనే క్రాస్ చేయడానికి సిద్ధం అవుతుంది…మొత్తం మీద మూడు సార్లు నైజాం ఏరియాలో 60 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి ప్రభాస్ ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను ఇప్పుడు సృష్టించాడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here