బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకు పోతున్న హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి మాస్ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తర్వాత సినిమా…
సంక్రాంతికి వస్తున్నాం మూవీ వలన స్లో డౌన్ అయినా కూడా స్టడీగానే బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్స్ ని సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు వెళుతుంది…సినిమా ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా…
బాలయ్య కెరీర్ లో మూడో సారి ఈ మార్క్ ని అందుకున్న మూవీ గా నిలిచి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. బాక్ టు బాక్ 4 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేశాడు బాలయ్య… అందులో ఒక్క భగవంత్ కేసరి…
స్లో స్టార్ట్ ను సొంతం చేసుకోవడం వలన లాంగ్ రన్ లో 75 కోట్ల షేర్ మార్క్ ని మిస్ చేసుకుంది కానీ మిగిలిన అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలు ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 75 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డాకు మహారాజ్ మూవీ …
రిమార్కబుల్ స్టార్ట్ హెల్ప్ అవ్వడంతో ఓవరాల్ గా 75 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసి 80 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. మొత్తం మీద లాస్ట్ 4 సినిమాల్లో ఏకంగా 3 సార్లు 75 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క..
సీనియర్ హీరోగా ఎపిక్ రికార్డ్ ను బాలయ్య టాలీవుడ్ లో సొంతం చేసుకున్నాడు….ఇక బాలయ్య చేస్తున్న అప్ కమింగ్ మూవీ అఖండ2 తో కచ్చితంగా మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు… ఇక డాకు మహారాజ్ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి…