బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి మాస్ రచ్చ చేసిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ, మూడు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మాస్ రచ్చ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా మూడో వారంలో కొంచం స్లో డౌన్ అయినా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో ఓవరాల్ గా మంచి జోరునే చూపించి కలెక్షన్స్ పరంగా లాభాలను మరింతగా పెంచుకునే ప్రయత్నం అయితే చేసింది అని చెప్పాలి… ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
20వ రోజుతో పోల్చితే 21వ రోజున 2 లక్షల రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 11 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక వరల్డ్ వైడ్ గా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.
దాంతో ఇప్పుడు 3 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 21 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.94Cr~
👉Ceeded: 1.54Cr
👉Andhra: 6.18Cr~
AP-TG Total:- 13.66CR(25.20CR~ Gross)
👉KA+ROI+OS : 3.77CR****approx
Total WW Collections: 17.43CR(Gross – 33.50CR~)
7 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 10.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతుంది అని చెప్పాలి ఇప్పుడు.