Home న్యూస్ 4 డేస్ అక్షయ్ కుమార్ బెల్ బాటం కలెక్షన్స్!

4 డేస్ అక్షయ్ కుమార్ బెల్ బాటం కలెక్షన్స్!

1773
0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక జనాలు అందరూ తిరిగి థియేటర్స్ లో అడుగు పెట్టడం ఖాయమని అంతా అనుకుంటున్న టైం లో మొదటి రోజు కలెక్షన్స్ అందరికీ భారీ శాకిస్తూ లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి.

కానీ సినిమా కి పాజిటివ్ టాక్ ఉండటం తో ఎలాగోలా తక్కువ మంది జనాలే అయినా థియేటర్స్ కి మినిమం సంఖ్యలో రావడం జరిగింది. దాంతో సినిమా కి మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ మొత్తం మీద సొంతం అవ్వడం విశేషం.

సినిమా మొదటి రోజు 2.65 కోట్ల కలెక్షన్స్ ని, రెండో రోజు 2.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, మూడో రోజు 3.1 కోట్ల కలెక్షన్స్ ని సాధించగా 4 వ రోజు సండే మరియు రక్షాభందన్ కూడా ఉండటం తో సినిమా 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 4 వ రోజు సొంతం చేసుకుని…

ఓవరాల్ గా వీకెండ్ ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించింది. మొత్తం మీద 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఇప్పుడు సినిమా… 12.95 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. ట్రేడ్ వర్గాలు సినిమా రిలీజ్ కి ముందు 20 నుండి 25 కోట్ల మధ్యలో కలెక్షన్స్ వస్తే బాలీవుడ్ తిరిగి తేరుకున్నట్లే అని భావించారు కానీ అందులో సగం కలెక్షన్స్ తోనే సినిమా సరిపెట్టింది.

ఇక సినిమా సాధించిన బిజినెస్ లో కొంత మొత్తాన్ని ఇప్పుడు మేకర్స్ రిటర్న్ ఇచ్చేశారని సమాచారం. సినిమా పెర్ఫార్మెన్స్ ఇక వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా మినిమమ్ 2 కోట్లకు పైగా కలెక్షన్స్ తో హోల్డ్ చేసినా ఓవరాల్ గా మొదటి వారం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ రావొచ్చు అంటున్నారు. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here