కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు ఆల్ మోస్ట్ వర్కింగ్ డే కాకున్నా కానీ పార్షిక హాలిడే లో కలెక్షన్స్ పరంగా చాలా వరకు దుమ్ము లేపింది…
కానీ నైజాంలో మట్టుకు సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… నైజాం కలెక్షన్స్ కన్నా కూడా వైజాగ్ లో పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో ఎక్కువ వసూళ్లు అక్కడ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక 4 వ రోజు సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని భావించినా కానీ సినిమా ఆ మార్క్ ని అందుకోలేదు, నైజాం హెవీ డ్రాప్స్ వలన టార్గెట్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని టార్గెట్ ని మిస్ చేసుకుంది.
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.14Cr
👉Ceeded: 5.31Cr
👉UA: 3.74Cr
👉East: 3.03Cr
👉West: 2.17Cr
👉Guntur: 2.67Cr
👉Krishna: 1.70Cr
👉Nellore: 1.36Cr
AP-TG Total:- 27.12CR(43.80Cr~ Gross)
👉Ka+ROI: 1.56Cr
👉OS – 1.28Cr
Total WW: 29.96CR(50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 39 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 9.04 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది…