Home న్యూస్ ఇండియాలో ఫస్ట్ మూవీ….4 రోజుల్లో ఔట్….భీభత్సం ఇది!

ఇండియాలో ఫస్ట్ మూవీ….4 రోజుల్లో ఔట్….భీభత్సం ఇది!

21343
0

2021 ఇయర్ టాలీవుడ్ కి తిరుగులేని విధంగా కలిసి వచ్చింది… ఫస్ట్ వేవ్ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలుగా నిలిచి దుమ్ము లేపాయి. దాంతో ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలోనే హైయెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్న ఇండస్ట్రీ గా రికార్డు ను సృష్టించి దూసుకు పోతూ ఉన్న టైం లో మళ్ళీ ఇండియా లో…

సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం జరిగింది… దాంతో మళ్ళీ 3 నెలలు థియేటర్స్ అన్నీ క్లోజ్ అవ్వగా ఇప్పటికీ కూడా కొన్ని స్టేట్స్ లో థియేటర్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఇలాంటి టైం లో జనాలు థియేటర్స్ కి వస్తారో రారో అన్న డౌట్ తో చాలా వరకు థియేటర్స్ ని మూసేసి ఉంచగా…

థియేటర్స్ తెరచిన చోట కూడా సినిమాలను రిలీజ్ చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి టైం లో అందరికన్నా ముందు థియేటర్స్ ని రీ ఓపెన్ చేసి సినిమాల రిలీజ్ లను కన్ఫాం చేస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన…

చిన్న సినిమా SR కళ్యాణ మండపం ఇప్పుడు 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సెకెండ్ పాండమిక్ తర్వాత ఏకంగా ఇండియా లోనే హిట్ గా నిలిచిన మొదటి సినిమా గా నిలిచి భీభత్సం సృష్టించింది. ఈ రేంజ్ లో రచ్చ చేస్తుందని అనుకోలేదు. ఈ సినిమా కన్నా ముందు రిలీజ్ అయిన తిమ్మరుసు పర్వాలేదు అనిపించినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను తిరిగి భారీ లెవల్ లో థియేటర్స్ కి రప్పించిన సినిమా SR కళ్యాణ మండపం. అందునా మిక్సుడ్ టాక్ తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపడం విశేషం. ఇక వరుస పెట్టి ఇప్పుడు తెలుగు సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here