బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది. సినిమా నాలుగో రోజు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా మొదటి మూడు రోజుల మాదిరిగా అంచనాలను అమాంతం అయితే ఏమి మించిపోలేదు కానీ ఓవరాల్ గా మండే టెస్ట్ ను అయితే….
ఓవరాల్ గా పాస్ అయ్యింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 6.5 కోట్ల నుండి 7 కోట్ల దాకా వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6.92 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది.
ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం 8 నుండి 9 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకుంటే ఆ అంచనాలను మాత్రం మించిపోయి 10 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుని ఇప్పుడు సాలిడ్ వసూళ్ళని సొంతం చేసుకుంది. హిందీలో సాలిడ్ గ్రోత్ సినిమాకి హెల్ప్ అయ్యింది. సినిమా మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 29.33Cr(inc GST)
👉Ceeded: 9.90Cr
👉UA: 5.15Cr
👉East: 3.47Cr
👉West: 2.92Cr
👉Guntur: 3.83Cr
👉Krishna: 3.09Cr
👉Nellore: 2.21Cr
AP-TG Total:- 59.90Cr(89.55CR~ Gross)
👉Karnataka: 7.85Cr
👉Tamilnadu: 5.74Cr
👉Kerala: 2.81Cr
👉Hindi: 7.52Cr
👉ROI: 1.9Cr
👉OS – 8.72Cr
Total WW: 94.44CR(162CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ఇప్పుడు 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 51.56 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి వసూళ్ళని సొంతం చేసుకుంటుందో చూడాలి.