ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది… సినిమా మొదటి రోజు సొంతం చేసుకున్న టాక్ కి వీకెండ్ లో హోల్డ్ చేసిన విధానం అల్టిమేట్ అనే చెప్పాలి. సినిమా రెండో రోజు మూడో రోజు అంచనాలను మించి గ్రోత్ ని చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా వీకెండ్ తర్వాత…
రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 78 కోట్ల రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 140 కోట్ల రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా ఇక 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 12 నుండి 13 కోట్ల మధ్యలో గ్రాస్ ను….
సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా హిందీ లో ఈ రోజు మరో సారి 3 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా తమిళ్ లో కన్నడల లో ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ ని సాధించడం ఖాయమని చెప్పాలి. సినిమా మొత్తం మీద…
ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 17 కోట్ల నుండి 18 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల బాగుంటే 18 కోట్ల మార్క్ ని అధిగమించి ముందుకు వెళ్ళవచ్చు. సినిమా మొత్తం మీద ఇప్పుడు 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో…
ఇప్పుడు 4 రోజుల్లో 90 కోట్ల రేంజ్ గ్రాస్ ను, టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 158 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది, మించిపోయే ఛాన్స్ ఉంది, ఈ టాక్ తో 150 కోట్ల సింహాసనం పై కూర్చోవడం విశేషం అని చెప్పొచ్చు. ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.