సుధీర్ బాబు ఆనంది ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వీకెండ్ లో జస్ట్ యావరేజ్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే వర్కింగ్ డేస్ లో రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం తో బరిలోకి దిగినా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు సినిమా…
ఏమాత్రం జోరు చూపలేక పోయింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 4 వ రోజు వర్కింగ్ డే అయినా మినిమం 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగినా ఓవరాల్ గా సినిమా 39 లక్షల రేంజ్ షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఓన్ రిలీజ్ కాకుండా ఉన్న బిజినెస్ 8 కోట్లకి 8.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 1.22Cr
👉Ceeded: 57L
👉UA: 43L
👉East: 32L
👉West: 17L
👉Guntur: 35L
👉Krishna: 19L
👉Nellore: 10L
AP-TG Total:- 3.35CR(5.42Cr Gross)
KA+ROI: 8L
OS: 18L~
Total Collections: 3.61CR(5.97CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…. సినిమా బిజినెస్ ఎక్కువ రేంజ్ లో ఉండటం…
సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకునే రేంజ్ లో లేకపోవడం తో ఇక భారీ నష్టాలు కన్ఫాంగా మారుతున్నాయి. ఇంకా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే సినిమా మరి 4.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 5 వ రోజు ఏమైనా అద్బుతం సినిమా చేస్తుందో లేదో చూడాలి ఇక.