బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మూవీ మొదటి వీకెండ్ ని ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ తో ముగించుకుంది. సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చి ఉండి టికెట్ రేట్లు మరింత చవకగా ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండేది. అయినా కానీ మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా…
మొత్తం మీద మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాలలో మంచి గ్రోత్ ని చూపించింది. నైజాంలో కొంచం స్లో అయినా కానీ ఆంధ్రలో మంచి హోల్డ్ ని చూపించింది.
సినిమా మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా అంచనాలను మించితే 2.7 కోట్ల దాకా వెళుతుంది అనుకోగా సినిమా 2.86 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 3.31 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.71Cr
👉Ceeded: 2.56Cr
👉UA: 2.06Cr
👉East: 1.12Cr
👉West: 1.03Cr
👉Guntur: 1.76Cr
👉Krishna: 80L
👉Nellore: 55L
AP-TG Total:- 14.59CR(22.45Cr~ Gross)
👉KA+ ROI: 80L
👉OS: 55L
👉Tamil – 82L~ est
Total World Wide: 16.76CR(28.00CR~ Gross)
మొత్తం మీద సినిమా 38 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ పూర్తీ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 22.24 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.