బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డే లో ఎంటర్ అయింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు మారిన కొత్త టికెట్ రేట్ల వలన తీవ్ర ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది, ఆంధ్రలో క్లాస్ సెంటర్స్ కాకుండా మిగిలిన సెంటర్స్ అన్నింటిలో కూడా 40, 50, 60, 70 ఇలా టికెట్ రేట్లు ఒక 7-8 ఏళ్ల క్రితం…
ఎలా ఉన్నాయో అలాంటి రేట్లని పెట్టగా ఆ రేట్లతో కలెక్షన్స్ కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు నైజాం లో అనుకోకుండా కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న ఆంధ్రా సీడెడ్ లో ఆక్యుపెన్సీ బాగానే సొంతం చేసుకుంది.
కానీ టికెట్ రేట్లు భారీగా తగ్గడం తో అవి కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి 4.19 కోట్ల షేర్ ని మొత్తం మీద 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోవాల్సి వచ్చింది ఈ సినిమా… టికెట్ హైక్స్ అలానే ఉండి ఉంటె 5.5 కోట్ల నుండి 6 కోట్ల లోపు కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది.
ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 17.42Cr
👉Ceeded: 8.96Cr
👉UA: 8.66Cr
👉East: 4.93Cr
👉West: 5.82Cr
👉Guntur: 5.58Cr
👉Krishna: 3.56Cr
👉Nellore: 2.63Cr
AP-TG Total:- 57.56CR (86.7Cr~ Gross)
KA+ROI – 3.23Cr (Corrected)
OS- 3.42Cr (Corrected)
Total WW: 64.21CR(98.20Cr~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమాను టోటల్ గా 89.35 కోట్లకు అమ్మగా 90 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా అనేక అవరోధాలను ఎదురుకుంటూ కూడా దుమ్ము లేపుతుంది. 4 రోజుల తర్వాత ఇంకా 25.79 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. ఇక 5 వ రోజు ఉగాది, 6 వ రోజు అంబేద్కర్ జయంతి హాలిడేస్ ఉండటం తో సినిమా రెట్టించిన జోరు చూపోచ్చు.