మాస్ మహారాజ్ రవితేజ హిట్స్ లో ఉన్నా ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ డిమాండ్ విషయంలో మాత్రం ఇవేవి పెద్దగా ఎఫెక్ట్ ఎప్పుడూ చూపలేదు అనే చెప్పాలి, దానికి కారణం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ రవితేజ సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ అనేవి ఎప్పుడూ సాలిడ్ గా జరుగుతూ వస్తూ ఉండటం అనే చెప్పాలి. లాస్ట్ 4 సినిమాలుగా రవితేజ ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు…
ఆ నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. అయినా కానీ రవితేజ ఒక్కో సినిమాకి 8-10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని ఎప్పుడూ సొంతం చేసుకుంటూ వచ్చాడట. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ సినిమాతో…
సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా సినిమా అల్టిమేట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. దాంతో ఇప్పుడు రవితేజ తన రెమ్యునరేషన్ ని పెంచారని సమాచారం. లేటెస్ట్ గా ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఒక్కో సినిమా కి రవితేజ…
కుదిరితే డైరెక్ట్ అమౌంట్ రెమ్యునరేషన్ గా లేదా సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ ని తీసుకుంటానని నిర్మాతలకు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. రవితేజ సినిమాల బిజినెస్ లు ఎలా ఉన్నా తెలుగు శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 20 కోట్ల రేంజ్ కి తగ్గకుండా వస్తున్న విషయం తెలిసిందే. అందుకే రవితేజ అందులో నుండి 16 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ గా..
తన అప్ కమింగ్ మూవీస్ కి తీసుకోబోతున్నారని సమచారం. రవితేజ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా థియేట్రికల్ బిజినెస్ లు 16-20 కోట్లు యావరేజ్ గా, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు 20 కోట్ల రేంజ్ కి తగ్గకుండా జరుగుతున్నాయి. అంటే ఈజీగా 30 కోట్ల రేంజ్ లో మూవీ తీస్తే నిర్మాతకి 10 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఈ రెమ్యునరేషన్ కి ఓకే చెబుతున్నారని అంటున్నారు.