Home న్యూస్ క్రాక్ కి అన్యాయం…రెడ్ కుమ్ముతుంది..4 సినిమాల లేటెస్ట్ థియేటర్స్ కౌంట్ ఇదే!!

క్రాక్ కి అన్యాయం…రెడ్ కుమ్ముతుంది..4 సినిమాల లేటెస్ట్ థియేటర్స్ కౌంట్ ఇదే!!

3806
0

సంక్రాంతి రేసులో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో నిలిచిన సినిమాలు 4, అందులో క్రాక్ సినిమా కి యునానిమస్ గా రెస్పాన్స్ దక్కగా తర్వాత వచ్చిన రెడ్ అండ్ అల్లుడు శీను సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా జోరు చూపుతుండగా డబ్బింగ్ మూవీ మాస్టర్ కి రిలీజ్ రోజు సాలిడ్ థియేటర్స్ దక్కినా తర్వాత పరిస్థితి మారి కొత్త సినిమాల వలన…

థియేటర్స్ ని కోల్పోయింది. ఇక పండగ టైం లో థియేటర్స్ ని అన్ని సినిమాలు పంచుకోగా జనవరి 14 న థియేటర్స్ విషయం లో కొత్త సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దక్కాయి. ఇక 15 మరియు 16 వ తేదీకి వచ్చేసరికి అన్ని సినిమాల టాక్ లు బయటికి వచ్చాక…

కూడా సినిమా థియేటర్స్ కౌంట్ విషయం లో రవితేజ క్రాక్ కి అన్యాయం జరిగింది. ఒకసారి అన్ని థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… ముందుగా రెడ్ మూవీ సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి 555 థియేటర్స్ ని దక్కించుకుని రన్ ని కొనసాగిస్తుంది. ఇక మరో సినిమా…

అల్లుడు అదుర్స్ 362 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది, ఇక డబ్ మూవీ మాస్టర్ కి 276 థియేటర్స్ దక్కగా క్రాక్ సినిమా కి 314 థియేటర్స్ మొత్తం మీద దక్కాయి. కలెక్షన్స్ పరంగా రెడ్ తర్వాత బెస్ట్ అనిపించుకునే ఓపెనింగ్స్ ఇప్పటికీ క్రాక్ కి వస్తున్నాయి. అయినా కానీ థియేటర్స్ తగ్గించి నాసిరకం థియేటర్స్ ఇచ్చినా జనాలు వస్తూ ఉండటం విశేషం. కానీ అల్లుడు అదుర్స్ కి రెవెన్యూ తక్కువ వస్తున్నా..

ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం డబ్బింగ్ మూవీ మాస్టర్ కి కూడా భారీగానే థియేటర్స్ ఇవ్వడం తో క్రాక్ కి థియేటర్స్ లేకపోయాయి. అయినా కానీ ఉన్న థియేటర్స్ లోనే క్రాక్ కలెక్షన్స్ ని రాబడుతూ బ్రేక్ ఈవెన్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ థియేటర్స్ కౌంట్ వీకెండ్ అయ్యే వరకు ఇలానే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here