బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కన్సిస్టంట్ గా వరుస హిట్స్ కొట్టడం అన్నది ఒకెత్తు అయితే ఆ హిట్స్ ని బ్లాక్ బస్టర్స్ గా మార్చే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే ఇలాంటి అద్బుతమైన ఫాం ని సొంతం చేసుకున్న హీరోగా కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ గురించి చెప్పుకోవాలి. మెర్సల్ నుండి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతున్న విజయ్…
ప్రతీ ఒక్క సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేస్తున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే లాస్ట్ 4 సినిమాల్లో ఒక్క విజిల్ తప్ప ఏ సినిమా కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోలేదు…
యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేశాడు విజయ్, ముందు మెర్సల్ సినిమా 240 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా తర్వాత వచ్చిన సర్కార్ యావరేజ్ రేంజ్ టాక్ తోనే 250 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఇక తర్వాత వచ్చిన…
బిగిల్ సినిమా హిట్ టాక్ ని దక్కించుకుని ఆల్ మోస్ట్ 300 కోట్ల దాకా వసూళ్ళని సొంతం చేసుకోగా, రీసెంట్ గా వచ్చిన విజయ్ మాస్టర్ మూవీ కి యావరేజ్ రేంజ్ టాక్ రాగా పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన సినిమా అవ్వడం 50% లిమిటేషన్లు ఉండటం లాంటివి ఉన్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసే విజయాన్ని నమోదు చేసుకుంది.
దాంతో బాక్ టు బాక్ 4 సార్లు 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న హీరోగా ఇలయ దళపతి విజయ్ ఇప్పుడు రికార్డుల కెక్కాడు. ఇప్పుడు విజయ్ ఉన్న ఫాం దృశ్యా సినిమా కి యావరేజ్ రేంజ్ టాక్ వస్తే చాలు అది బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయం అనిపించే రేంజ్ ఫాం తో దూసుకు పోతున్ననాడు విజయ్…