Home న్యూస్ 4 ఏళ్ల క్రితం మూవీ…ఇప్పుడు రిలీజ్…బిజినెస్ రేంజ్ ఎలా ఉందంటే!!

4 ఏళ్ల క్రితం మూవీ…ఇప్పుడు రిలీజ్…బిజినెస్ రేంజ్ ఎలా ఉందంటే!!

3108
0

యాక్షన్ హీరో గోపీచంద్ నయనతారల కాంబినేషన్ లో సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఆరడుగుల బుల్లెట్… ఎప్పుడో 2016 లో మొదలు అయ్యి 2017 టైం లో రిలీజ్ కి సిద్ధం అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చివరి నిమిషంలో రిలీజ్ కి నోచుకోలేదు. అప్పటి నుండి వరుస పెట్టి సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ కి ముందు…

పోస్ట్ పోన్ లు అవుతూ రాగా ఏళ్ళు గడిచిపోయాయి. లాస్ట్ ఇయర్ ఇక థియేటర్స్ లో కుదరదు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని భావించగా ఆఫర్స్ అనుకున్న విధంగా రాకపోవడంతో సినిమా ను అప్పుడు రిలీజ్ చేయలేదు, ఈ ఇయర్ కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినా కానీ…

అవి కూడా ఆశించిన మేర రాలేదు. ఇలాంటి టైం లో నిర్మాత ఇక థియేటర్స్ లోనే సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి సినిమాను ఇప్పుడు ఈ నెల 8 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఇది వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ కాకుండా కొత్త కట్ తో వచ్చిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఆల్ మోస్ట్ 2 మిలియన్స్ వరకు వ్యూస్ రావడం మంచి రీచ్ నే సొంతం చేసుకునేలా చేయగా ఇప్పుడు సినిమా బిజినెస్ రేంజ్ 3 కోట్లకు అటూ ఇటూగా జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలలో టాక్ గట్టిగా వినిపిస్తుంది.

సీటిమార్ సినిమా అతి కష్టం మీద 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మంచి టాక్ తో సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడో 4 ఏళ్ల నుండి రిలీజ్ ఆగిపోతూ వస్తుంది. మరి ఇలాంటి టైం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నడుమ ఎంతవరకు ఈ కలెక్షన్స్ పరంగా జోరు చూపుతుంది అన్నది ఆసక్తికరం. ఇక టోటల్ బిజినెస్, థియేటర్స్ కౌంట్ వివరాలు రిలీజ్ కి ముందు రోజు క్లియర్ గా తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here