అల్టిమేట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది, లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న…
అనుమానాలు వచ్చినా కూడా ఎన్టీఆర్ తన మాస్ పవర్ ను చూపించి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సాలిడ్ ప్రాఫిట్స్ ను సైతం సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండగా లేటెస్ట్ గా సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మమ్మోత్ 40 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఈ మార్క్ ని కన్నడ లో అందుకున్న అతి కొద్ది మంది హీరోలలో…
ఒకరిగా నిలిచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్….సినిమా కన్నడలో ఓవరాల్ గా 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ ను సైతం అందుకుని ఇప్పుడు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడంతో పాటు…
ఓవరాల్ గా 18 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద డీసెంట్ ప్రాఫిట్ ను సైతం సొంతం చేసుకుని ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటంతో దీపావళి వరకు ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.