బాలీవుడ్ లో ఇప్పుడు చిన్న స్టార్స్ నుండి పెద్ద స్టార్స్ వరకు అందరి గుండెల్లో భయం ఉంది. దానికి కారణం సుశాంత్ సింగ్ సందేహాత్మక మరణం అనే చెప్పాలి. తన మరణం పై ఎవ్వరూ పెద్దగా స్పందించక పోవడం, ఇప్పుడు యావత్ ఫ్యాన్స్ అందరూ చేస్తున్న పోరాటంలో బాలీవుడ్ వాళ్ళు ముందుకు రాకపోవడంతో అందరి సినిమాలను టార్గెట్ చేసిన ఫ్యాన్స్ ముందు స్టార్ కిడ్స్ మూవీస్ పై తీవ్రంగా తమ కోపాన్ని చూపారు.
ఆలియా భట్ సడక్ 2 కానీ, అనన్య పాండే ఖాళీ పీలి సినిమా టీసర్ ట్రైలర్ కి భారీ లెవల్ లో డిస్ లైక్స్ దక్కగా ఇప్పుడు మరో బిగ్ హీరో మూవీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్… ఆ హీరోనే అక్షయ్ కుమార్ నటించిన కొత్త సినిమా లక్ష్మీ బాంబ్….
అక్షయ్ కు సుశాంత్ కి ఎలాంటి ఓపెన్ గొడవ లేకున్నా సోషల్ మీడియా లో సుశాంత్ చేయాల్సిన కొన్ని క్రేజీ మూవీస్ ని అక్షయ్ తన స్టార్ పవర్ తో దక్కించుకున్నాడని, సుశాంత్ చేసిన MS ధోని బయోపిక్ ని కూడా ముందు దక్కించుకోవడానికి బాగా ట్రై చేస్తే డైరెక్టర్ తో గొడవ అయ్యి…
ఇక తనతో చేయాల్సిన సినిమా అపేశాడని వార్తలు చాలానే ప్రచారంలో ఉన్నాయి… దాంతో అక్షయ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. మరో పక్క 40 కోట్ల బడ్జెట్ తో ఆల్ మోస్ట్ 225 కోట్ల బిజినెస్ చేసి అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ కింద 100 కోట్ల మేర తీసుకున్నా నిర్మాతకు ఇంకా…
85 కోట్ల ప్రాఫిట్ ఇచ్చిన లక్ష్మీ బాంబ్ సినిమా ను ఈ పాటికే రిలీజ్ చేయాలి అనుకున్నా డిలే చేస్తూ వెళుతున్నారు. దానికి కారణం సుశాంత్ ఫ్యాన్స్ అనే అంటున్నారు బాలీవుడ్ లో… మరికొంత టైం తీసుకున్నాకే పరిస్థితులు మరింత చక్క దిద్దుకున్నాకే ఈ ట్రైలర్ వస్తుంది అన్న టాక్ కూడా ఉంది, మరో పక్క ఫ్యాన్స్ కూడా ఎంత లేట్ అయినా ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది చూడండి అంటూ కాచుకు కూర్చున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి మరి…