6 ఏళ్ల తర్వాత సోలో మూవీ….ఎపిక్ బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) శుక్రవారం అల్టిమేట్ లెవల్ లో రిలీజ్ కాబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగుతున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ లెవల్ లో ఓపెన్ అవ్వగా ఇండియా బుకింగ్స్ ముందు కర్ణాటక అండ్ కొన్ని ఇతర చోట్ల ఓపెన్ అవ్వగా ఆల్ రెడీ 3.5 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ రాంపెజ్…
ఎక్స్ లెంట్ నోట్ తో స్టార్ట్ అవ్వగా, ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల మార్క్ ని ఆల్ రెడీ దాటేసింది. టోటల్ ఇండియాలో 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ఇప్పటి వరకు జరగగా ఇంకా బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది.
ఇక ఓవర్సీస్ లో ఆల్ రెడీ 25 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ జరగగా ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ వైడ్ బుకింగ్స్ 47 కోట్ల మమ్మోత్ మార్క్ ని అందుకోగా అందులో మొదటి రోజుకి గాను బుకింగ్స్ 40 కోట్లకు పైగా లో ఉన్నాయి. సినిమా ఫుల్ బుకింగ్స్ లెక్కలు ఇంకా మాసివ్ గా ఉండే అవకాశం ఉండగా…
ఓవరాల్ గా బిగ్ సోలో రిలీజ్, ఎక్స్ లెంట్ క్రేజ్, టికెట్ హైక్స్, స్పెషల్ షోలు ఇలా అనేక అడ్వాంటేజ్ లతో బరిలోకి దిగుతున్న దేవర సినిమాకి ఇక పాజిటివ్ టాక్ వచ్చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కలెక్షన్స్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.