బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో 206 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా కూడా 408 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను…
అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా 15వ రోజున కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకుని కూడా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించడం విశేషం. తెలుగు రాష్ట్రలలో మొత్తం మీద సినిమా 15వ రోజున 2.6-2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక హిందీలో ఈ రోజు 1.3-1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా ఈ రోజు 80 లక్షల నుండి కోటి రేంజ్ లో…
గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతో మొత్తం మీద 15వ రోజున దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా… 4.6-4.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 209 కోట్ల లోపు గ్రాస్ ను…
దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 413 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతుంది. ఓవరాల్ గా 15 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న దేవర ఇక ఈ రోజు నుండి సోమవారం వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 15 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.