Home గాసిప్స్ 420 కోట్లు ఏంటి సామి!!

420 కోట్లు ఏంటి సామి!!

0

     బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…. బాహుబలి తో వచ్చిన క్రేజ్ నామ మాత్రం కాదని సాహో నిరూపించింది, ఆ సినిమా డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి సూపర్ హిట్ గా నిలిచింది, దాంతో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకేక్కుతున్నాయి.

ఇక తన అప్ కమింగ్ మూవీస్ బడ్జెట్ కూడా భారీ ఎత్తునే ఉండబోతుందని చెప్పొచ్చు. ముందుగా అప్ కమింగ్ మూవీ జాన్ క్లియర్ బడ్జెట్ ఎంత అనేది రివీల్ చేయలేదు కానీ ఇండస్ట్రీ లో ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ఫేం నాగ అన్వేష్ డైరెక్షన్ లో భారీ ఎత్తున రూపొందబోతున్న సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా బడ్జెట్ ఎస్టిమేషన్ ఇప్పుడు లీక్ అయింది. ఆ లీక్ అయిన న్యూస్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా…

420 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా, ఫైనల్ బడ్జెట్ షూటింగ్ ప్రాసెస్ ని బట్టి 450 కోట్ల వరకు కూడా వెల్లోచ్చని అంటున్నారు. టాలీవుడ్ లో బాహుబలి సిరిస్ కి 450 కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇక సోలో మూవీ పరంగా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి 350 కోట్ల నుండి 400 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అవుతుందని అంటున్నారు.

ఇప్పుడు ప్రభాస్21 మూవీ ఎస్టిమేషన్ బడ్జెట్ 420 కోట్లు అంటుండటం తో ఇది నిజం అయితే టాలీవుడ్ లో సోలో మూవీస్ పరంగా బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందే సినిమా ఈ సినిమా సంచలన రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఉంది, ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here