బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమాలు ఈ డిజిటల్ టైం లో చాలా తక్కువే అని చెప్పాలి. ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రెండు మూడు వారాల తర్వాత పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిందే, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును స్ట్రాంగ్ గా మరి కొన్ని వారాలు ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటాయి, ఇప్పుడు అఖండ అందులో ఒకటిగా నిలిచింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 42 వ రోజున సినిమాకి హైదరాబాదు లో AMB థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డు పడింది, టికెట్ రేట్లు తక్కువగా ఉండే ఆంధ్రలో హౌస్ ఫుల్ అంటే అది ఒక లెక్క ఉంటుంది కానీ బాలయ్యకి అంతగా మార్కెట్ లేదు అన్న నైజాంలో…
హైదరాబాదులో ఇలాంటి హౌస్ ఫుల్ షోలు ఇప్పటికీ పడుతూనే ఉండటం బాలయ్య మాస్ జాతరకి నిదర్శనం అని చెప్పాలి. ఈ జోరు సంక్రాంతి సెలవుల్లో కూడా కొనసాగేలా ఉండగా సంక్రాంతి సీజన్ కోసం టీం ఆల్ రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టడంతో ఈ వారంలో కూడా కలెక్షన్స్ పరంగా అఖండ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.