Home న్యూస్ 445 కోట్లతో మాస్ భీభత్సం సృష్టిస్తున్న SRK

445 కోట్లతో మాస్ భీభత్సం సృష్టిస్తున్న SRK

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో వారంలో ఎంటర్ అయ్యి ఏమాత్రం స్లో అవ్వకుండా దుమ్ము దుమారం లేపుతూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది. సినిమా 9 రోజులు పూర్తీ అయ్యే టైంకి..364.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

ఇప్పుడు 10వ రోజున సినిమా 14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో సినిమా టోటల్ గా 10 రోజుల్లో ఇండియాలో సినిమా మొత్తం మీద 378.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇందులో…

సౌత్ డబ్బింగ్ వర్షన్స్ కింద 13.70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందట. ఓన్లీ హిందీ వర్షన్ కింద ఆల్ మోస్ట్ 364.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా టోటల్ గా ఇండియాలో ఇప్పటి వరకు సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా…

445 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం. ఇక ఈ శని ఆదివారాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించి కలెక్షన్స్ పరంగా మళ్ళీ దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here