బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఊరమాస్ మూవీ సలార్(Salaar) ముందు అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా సంచలన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించేది కానీ సినిమా రిలీజ్ డిలే అవ్వడం వలన…
సినిమా రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన రోజు నుండి ఊరమాస్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా తర్వాత టైంలో సోషల్ మీడియా లో సినిమా మీద…
చాలా మీమ్స్ వచ్చాయి…వాటిలో Eat Sleep Salaar Repeat అనే స్లోగన్ బాగా పాపులర్ అవ్వగా సినిమాల్లో కూడా ఈ మీమ్ ను వాడుకునే రేంజ్ లో పాపులర్ అయింది. సినిమా డిజిటల్ లో సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా అలానే…
ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండ్స్ లో ఒకటి గా నిలిచింది…ఆల్ మోస్ట్ సినిమా డిజిటల్ రిలీజ్ అయిన 450 రోజులు అయినా కూడా ఇప్పటికీ టాప్ ట్రెండ్స్ మూవీస్ లో ఒకటిగా ప్రతీ వారం ట్రెండ్స్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం..
సినిమా టెలివిజన్ లో అనుకున్న రేంజ్ లో క్లిక్ కాక పోయినా డిజిటల్ లో మాత్రం ఎక్స్ లెంట్ రీచ్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ ఎలివేషన్ ల పరంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండగా ఓవరాల్ గా 450 రోజులు అయినా కూడా సలార్ ఊరమాస్ జాతరని డిజిటల్ లో కొనసాగిస్తూ ఉండటం మాస్ రచ్చ అనే చెప్పాలి.