బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉన్న టైంలో ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ కొట్టాల్సిన అవసరంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కోసం ఎంతో కష్టపడిన వరుణ్ తేజ్, ప్రమోషన్స్ ను ఎంతో గట్టిగా చేసినా కూడా…
మొదటి రోజే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా..బడ్జెట్ పరంగా చూసుకుంటే మినిమమ్ న్యాయం కూడా చేయలేక…
ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది….సినిమా ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అందులో 10% కూడా రికవరీని సొంతం చేసుకోలేక పోయిన సినిమా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా, నష్టాలను తగ్గించుకోవడానికి సినిమా ను ఇప్పుడు…
ఎర్లీ ఓటిటి రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం….సినిమా ఓటిటి డీల్ రిలీజ్ కి ముందే అమెజాన్ ప్రైమ్లో మంచి రేటుకి అమ్ముడు పోయింది….కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ అట్టర్ ఫ్లాఫ్ గా రావడంతో ముందు 5-6 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా…
ఇప్పుడు కేవలం 3 వారాల టైంకే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది….డిసెంబర్ 5న సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది…ఆల్ రెడీ బాక్స్ అఫీస్ దగ్గర చుక్కలు కనిపించే రేంజ్ లో డిసాస్టర్ అయిన సినిమా ఇప్పుడు డిజిటల్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.