Home గాసిప్స్ 45 కోట్ల ప్రాజెక్ట్….ఈ రేంజ్ స్పీడ్ ఏంటి సామి!!

45 కోట్ల ప్రాజెక్ట్….ఈ రేంజ్ స్పీడ్ ఏంటి సామి!!

1576
0

బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్స్ పరంగా కెరీర్ మొదలు పెట్టిన ఇన్ని ఏళ్లలో రెండు మూడు సార్లు తప్పితే ఎక్కువ శాతం ఆడియన్స్ ని నిరాశ పరిచిన హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకరు, స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నప్పటికీ బిగ్ డైరెక్టర్స్ వెంట పడకుండా కొత్త కొత్త ప్రయోగాలను చాలా వరకు ఆడియన్స్ కి అందించి ఇక కమర్షియల్ మూవీస్ బాట పట్టిన కళ్యాణ్ రామ్ పటాస్ తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ని దక్కించుకోగా ఎలాగోలా రెండేళ్ళ క్రితం 118 సినిమాతో మరో హిట్ ని అందుకున్నా తర్వాత ఎంతమంచి వాడవురా డిసాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది. ఇలాంటి టైములో కళ్యాణ్ రామ్ ఎలాంటి మూవీ చేస్తాడు…

అని అందరూ ఆశగా ఎదురు చూడగా ఓ భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్, కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో బింబిసర అంటూ ఓ మైతలాజికల్ కథతో ఆడియన్స్ ముందుకు రానున్నట్లు సినిమా లుక్ ని టైటిల్ ని చిన్న టీసర్ ని రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

ఇక సినిమా రెండు పార్టులు అని, లేదు మూడు పార్టులుగా ఆడియన్స్ ముందుకు రాబోతుందని వార్తలు వస్తున్నా ప్రస్తుతానికి ఒకటే పార్ట్ అంటూ యూనిట్ వర్గాలు చెబుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా కోసం కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ అనిపించే విధంగా 45 కోట్ల బడ్జెట్ తో ఓన్ గా నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా షూటింగ్ ని ఆల్ మోస్ట్…

80% వరకు కంప్లీట్ చేశాడని తెలుస్తుంది. అందులో కూడా టాకీ పార్ట్ 90% కంప్లీట్ అయిపోయిందట. రెండు పాటలు బాలెన్స్ ఉన్నాయని, అవి కూడా కలిపి 80% కంప్లీట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేసి కుదిరితే ఈ ఇయర్ ఎండ్ టైం కి ఆడియన్స్ ముందుకు తేవాలని ఆలోచిస్తున్నారట. మరి ఈ రేంజ్ స్పీడ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here