బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవికి పూర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ తర్వాత మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు నైట్ షోలకు ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది. దాంతో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూ గా ఇప్పుడు…
మొత్తం మీద వీర సింహా రెడ్డితో పోల్చితే షోలు తక్కువగానే పడినా కానీ టికెట్ హైక్స్ కొంచం ఎక్కువగానే ఉండటంతో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు, ఫైనల్ లెక్కలు కూడా అన్ని చోట్లా బాగుండటంతో…
32 కోట్ల రేంజ్ ఆ పైనా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా 40 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి 42 కోట్ల నుండి ఆ పైన వసూళ్లు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది…
మొత్తం మీద ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా అంచనాలను అన్నీ మించిపోయి 45 కోట్ల కు చేరువ అయ్యే రేంజ్ గ్రాస్ మార్క్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే మెగా మాస్ రాంపేజ్ అనే చెప్పాలి… ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.