మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే చిన్న ఇండస్ట్రీగా చెప్పుకునే మలయాళ ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు కొన్ని బిగ్ బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి కానీ మరీ ఇతర ఇండస్ట్రీల రేంజ్ లో రచ్చ చేసే రేంజ్ విజయాలు సొంతం అవ్వలేదు కానీ రీసెంట్ ఇయర్స్ లో వాళ్ళ మార్కెట్ కూడా పెరిగి పోయింది అని చెప్పాలి…
రెండేళ్ళ క్రితం 2018 మూవీ, లాస్ట్ ఇయర్ ఆడుజీవితం, మంజుమ్మేల్ బాయ్స్ లాంటి సినిమాలు మాస్ రచ్చ చేయగా ఈ ఏడాది సమ్మర్ టైంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన 2 సినిమాలు అల్టిమేట్ కలెక్షన్స్ తో అన్ని రికార్డుల బెండు తీశాయి…
ముందు భారీ హైప్ నడుమ వచ్చిన లూసిఫర్2 మూవీ మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 270 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు లేటెస్ట్ గా మోహన్ లాల్…
నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ రీసెంట్ గా 200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి 205 కోట్ల మార్క్ ని టచ్ చేసి దుమ్ము దుమారం లేపగా..
ఓవరాల్ గా కేవలం నెల గ్యాప్ లో మోహన్ లాల్ నటించిన రెండు సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ అక్షరాలా 475 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా…మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో ఇలా తక్కువ గ్యాప్ లో ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు మోహన్ లాల్…