రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీ మాస్ రాంపెజ్ ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 7వ వీకెండ్ లో కూడా మంచి జోరుని చూపించగా హిందీ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి కుమ్మేసిన తర్వాత ఇప్పుడు 47వ రోజున…
మరోసారి ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా ఎట్టకేలకు ఈ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా కోటి లోపు గ్రాస్ మార్క్ ని అందుకుంది. రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా 46 రోజుల పాటు కోటికి తగ్గకుండా గ్రాస్ మార్క్ ని అందుకుని ఓ రేంజ్ లో కుమ్మేసిన పుష్ప2 మూవీ….
47 వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…దాంతో 47 రోజుల్లో ఫస్ట్ టైం కోటి లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ గా 47 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 47 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.42Cr
👉Ceeded: 35.58Cr
👉UA: 25.02Cr
👉East: 13.63Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.05Cr
👉Krishna: 13.16Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 226.36CR(345.20CR~ Gross)
👉KA: 53.35Cr
👉Tamilnadu: 34.85Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 387.28Cr
👉OS – 127.19Cr***Approx
Total WW Collections : 836.63CR(Gross- 1,756.22CR~)
ఓవరాల్ గా 620 కోట్ల టార్గెట్ మీద 216.63 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము దుమారం లేపిన పుష్ప2 మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ కానుండగా మిగిలిన రన్ లో కొద్ది వరకు షేర్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఫైనల్ రన్ లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.