టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్ ల లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్యా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
కానీ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఓపెనింగ్స్ రేంజ్ అయితే తగ్గింది అని చెప్పాలి. ఇక ఆంధ్ర సీడెడ్ లో టికెట్ హైక్స్ లాంటివి ఏమి పెద్దగా లేక పోవడంతో గ్రాస్ కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ కూడా ఉంది…
అయినా కానీ మొదటి రోజు సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 34 కోట్ల దాకా గ్రాస్ మార్క్ ని సినిమా అందుకోవచ్చు. ఇండియా డే 1 గ్రాస్ 37-38 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా మొదటి 46 కోట్ల నుండి 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది…
సినిమా రిలీజ్ కి ముందు ఉన్న బజ్ చూసి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో అన్న డౌట్స్ ఏర్పడినా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ నే సినిమా తొలిరోజు అందుకోబోతుంది. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే రేంజ్ లో ఉంటాయో లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.