మొదటి రోజు సాలిడ్ గా కుమ్మేసినా కూడా రెండు మూడు రోజుల్లో అనుకున్న రేంజ్ లో వసూళ్ళని అందుకోలేక పోయిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) 4వ రోజు మాత్రం మంచి జోరుని చూపించగా…
టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 32.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 39.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…
6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 7 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ లెక్కలు బాగుంటే….
8.5 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవరాల్ గా…
48 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 2 రోజులు తగ్గినా కూడా 4 మరియు 5వ రోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించింది అని చెప్పాలి. ఇక సినిమా 5 రోజుల్లో టోటల్ గా ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.