Home న్యూస్ టార్గెట్ ఔట్….దెబ్బ పడుతుంది అనుకుంటే దెబ్బ కొట్టిన ఆయ్ మూవీ!

టార్గెట్ ఔట్….దెబ్బ పడుతుంది అనుకుంటే దెబ్బ కొట్టిన ఆయ్ మూవీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో అసలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని సినిమా ఆయ్ మూవీ(AAY movie)…పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుంది అనుకున్న సినిమా ఏకంగా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని పెద్ద సినిమాలకే ఎదురు దెబ్బ కొట్టి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….రెండు మూడు రోజుల్లో మంచి జోరుని చూపించిన సినిమా…

నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని సినిమాలను డామినేట్ చేసి మాస్ రచ్చ చేయగా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసిన సినిమా క్లీన్ హిట్ గా నిలిచి ఆగస్టు 15 వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర విన్నర్ గా నిలిచి సత్తా చాటుకుంది ఇప్పుడు….మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున ఓవరాల్ గా…

1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ 2 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. మిగిలిన చోట్ల కూడా ఉన్నంతలో మంచి జోరుని చూపించిన సినిమా ఇక మీదట వచ్చేవన్నీ కూడా లాభాలే అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

ఒకసారి సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
AAY Movie Movie 4 Days Total Collections Report(Est)
👉Nizam: 1.65Cr~
👉Ceeded: 34L~
👉Andhra: 1.63Cr~
AP-TG Total:- 3.62CR(6.20CR~ Gross)
👉Ka+ROI+OS – 28L~
Total WW Collections – 3.90CR(6.95CR~ Gross)

మొత్తం మీద ఆయ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో ఆ టార్గెట్ ను దాటేసిన సినిమా 40 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక 5వ రోజు మరోసారి హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి అన్ని చోట్లా రెచ్చిపోయి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here