సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ కుమ్మేస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. రెండు బాక్ టు బాక్ ఎపిక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత…
నాగ చైతన్య ఈ సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా సినిమా అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకుంటూ ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టోటల్ బిజినెస్ 27.50 కోట్ల రేంజ్ కి జరిగింది….కాగా సినిమా 4 రోజులు పూర్తి అయ్యే టైంకే ఓవరాల్ గా 27.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది..కానీ ప్రాఫిట్స్ ను 5వ రోజున సాధించిన కలెక్షన్స్ తో దక్కించుకున్న సినిమా…
ఓవరాల్ గా ఒక్క సీడెడ్ తప్పితే టోటల్ గా నైజాం మరియు కోస్టల్ ఆంధ్రలో వాల్యూ బిజినెస్ లను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. సీడెడ్ లో మరో కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటే బిజినెస్ ను దాటేసి ఇక్కడ కూడా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మొత్తం మీద నాగ చైతన్య కి రెండు బాక్ టు బాక్…
డిసాస్టర్ మూవీస్ తర్వాత తండేల్ మూవీ తో అన్ సీజన్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అవుతూ ఉండగా, ఈ వీకెండ్ లో పోటి ఉన్నప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ తండేల్ కి ఎగబడి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా కి ఎలాంటి ప్రాఫిట్స్ సొంతం అవుతాయో చూడాలి.