Home న్యూస్ 4 డేస్ భైరవం కలెక్షన్స్…వర్కింగ్ డే టెస్ట్ రిజల్ట్ ఇదే!!

4 డేస్ భైరవం కలెక్షన్స్…వర్కింగ్ డే టెస్ట్ రిజల్ట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి…

సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో వీకెండ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది కానీ మాస్ సెంటర్స్ లో ఓకే అనిపించుకుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా…

మినిమమ్ 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు అనుకున్నా సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 62 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 68 లక్షల రేంజ్ లో షేర్ ని…

Bhairavam 4 Days Total WW Collections!

1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుని ఎక్కువగానే డ్రాప్ అయింది. దాంతో టోటల్ గా 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 4 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.07Cr~
👉Ceeded: 73L~
👉Andhra: 2.26Cr~
AP-TG Total:- 5.06CR(8.55CR~ Gross)
👉KA+ROI+OS : 0.70CR****approx
Total WW Collections: 5.76CR(Gross – 10.05CR~)
(34% Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో కేవలం 34% రేంజ్ లోనే రికవరీని సాధించింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 11.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here